New Projects

worlds largest Pump houses of Kaleshwaram Project


MEIL energises the worlds largest Pump house

bestprojectsinindia

రికార్డ్‌ సమయంలో కాళేశ్వరం లింక్‌-1 పవర్


ఇన్‌ఫ్రా రంగంలో తెలుగు రాష్ట్రాల్లో నెం1 స్థాయికి చేరుకుని దేశంలోనే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లు పూర్తిచేస్తున్న మేఘా ఇంజనీరింగ్‌ విద్యుత్‌ సబ్‌స్టేషన్ల నిర్మాణం, ట్రాన్స్‌మిషన్ల లైన్ల ఏర్పాట్లలో మరో రికార్డ్‌ను సొంతం చేసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగమైనా లింక్‌-1లోని మూడు పంపింగ్‌ స్టేషన్లకు అవసరమైన విద్యుత్‌ సరఫరా చేసే నాలుగు సబ్‌స్టేషన్లు వాటి లైన్లను సకాంలో పూర్తి చేసి తన నైపుణ్య ప్రతిష్టతను చాటుకుంది. దేశంలోనే తొలి అతిపెద్దదైన ప్రైవేటు రంగంలోని ట్రాన్స్‌మిషన్‌ వ్యవస్థ (డబ్ల్యూయూపిపిటిసిఎల్‌)ను ఉత్తరప్రదేశ్‌లో ఏర్పాటు చేయడమే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లో కదిరి వద్ద భారీ సబ్‌స్టేషన్‌ను గడువుకన్నా ముందే పూర్తి చేసి పవర్‌గ్రిడ్‌ నుంచి పురస్కారం అందుకుని జాతీయ స్థాయిలో మన్ననలు పొందిన మేఘా తాజాగా కాళేశ్వరం లింక్‌-1లోని భారీ విద్యుత్‌ వ్యవస్థను సిద్ధం చేసింది.


bestprojectsinindia,kaleshwaram

ఈ ప్రాజెక్ట్‌లో లింక్‌-1 కింద 3 పంప్‌హౌస్‌ల నుంచి 28 పంప్‌ల ద్వారా నీటిని ఎత్తిపోయటానికి 1120 మెగా వాట్ల విద్యుత్‌ అవసరమవుతుంది. ఇంత భారీ స్థాయిలో విద్యుత్‌ను వినియోగించి రోజుకు కనీసం 2 టిఎంసీల నీటిని ఎత్తిపోయటానికి అంతే విద్యుత్‌ అవసరమవుతుంది. ప్రపంచంలో ఇంతపెద్ద స్థాయిలో విద్యుత్‌ను వినియోగించే ఎత్తిపోతల పథకాలు ఇంతవరకు ఎక్కడా నిర్మించలేదు. ఇప్పటి వరకు ప్రపంచంలో ఇజిప్ట్‌లోని ముబారక్‌ పంపింగ్‌స్టేషన్‌ మాత్రమే అతి పెద్దది. ఈ ఎత్తిపోతల పథకానికి 288 మెగావాట్ల విద్యుత్‌ వినియోగించే వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ఏడేళ్ళ కాలం పట్టింది. కానీ మేఘా ఇంజనీరింగ్‌ చేపట్టిన కాళేశ్వరం లింక్‌-1 విద్యుత్‌ వ్యవస్థ దానికన్నా దాదాపు నాలుగు రెట్లు పెద్దది కాగా ఏడాది సమయంలోనే పూర్తి చేసి తన ఇంజనీరింగ్‌ నైపుణ్యాన్ని చాటుకుంది.
లింక్‌-1లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, ప్యాకేజీ-8 (రామడుగు) 4 సబ్‌స్టేషన్లతో పాటు ట్రాన్స్‌మిషన్‌ లైన్లను నిర్ణీత గడువు ఏడాదిన్నర లోగా పూర్తి చేసింది. రామడుగు (ప్యాకేజ్‌-8) సబ్‌స్టేషన్‌ 2017 ఫిబ్రవరి 22న ప్రారంభించి 2018 మే 6న గ్రిడ్‌కు అనుసంధానం చేసింది. సుందిళ్ల సబ్‌స్టేషన్‌ను 2017 జులై 30న పనులు ప్రారంభించి 2018 జులై 18తేది లోగా పూర్తిచేసింది. ఏడాదికి ముందే ఈ సబ్‌ష్టేషన్‌ పూర్తయ్యింది. అన్నారం సబ్‌స్టేషన్‌ పనులు 2017 ఏప్రిల్‌ 1న ప్రారంభించి 2018 సెప్టెంబర్‌ 14న వినియోగంలోకి తెచ్చి గ్రిడ్‌కు అనుసంధానం చేసింది. మేడిగడ్డ సబ్‌స్టేషన్‌ 2017 ఏప్రిల్‌ ప్రారంభం కాగా 2018 సెప్టెంబర్‌ 29న ఛార్జ్‌ చేసి గ్రిడ్‌కు అనుసంధానం చేసింది. మొత్తం లింక్‌-1లో వీటి పనులు పూర్తికావడం వల్ల జైపూర్‌ (అదిలాబాద్‌) విద్యుత్‌  కేంద్రం నుంచి మేడిగడ్డ వరకు విద్యుత్‌ నిరంతరాయంగా సరఫరా అయ్యే వ్యవస్థను మేఘా ఇంజనీరింగ్‌ పూర్తి చేయగలిగింది. 2017లో నాలుగు సబ్‌స్టేషన్ల పనులను తెలంగాణ ప్రభుత్వం మేఘా ఇంజనీరింగ్‌ సంస్థకు అప్పగించగా రికార్డు సమయంలో అంటే 2018 మే నెల నుంచి సెప్టెంబర్‌ నెలాఖరు నాటికి వరుసగా నాలుగు సబ్‌స్టేషన్లను ఎంఈఐఎల్‌ అందుబాటులోకి తెచ్చిందని ఎంఈఐఎల్‌ పవర్‌ డిపార్ట్‌మెంట్‌ వైస్‌ప్రెసిడెంట్‌ ప్రవీణ్‌ శరథ్‌ దీక్షిత్‌ చెప్పారు.




No comments:

Post a Comment

Thanks you